* తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్హైదరాబాద్:తెలంగాణలోనినిరుద్యోగులకు వయో పరిమితి సడలింపు ఉంటుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. నవంబరు 24న నిరుద్యోగ సమస్యపై శాసనసభలో చర్చ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. నిరుద్యోగులకు 5 ఏళ్ల వయో సడలింపు ఇచ్చి నియామకాలు చేపడతామని ఆయన పేర్కొన్నారు. త్వరలోనే టీఎస్పీఎస్సీ ఏర్పాటుకు నోటిఫికేషన్ వెలువడనుందని కేసీఆర్తెలిపారు. యువతకు ఉద్యోగాలు కల్పించే విషయంలో ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుంటుందన్నారు. తెలంగాణలో 1,07,744 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. నిరుద్యోగ యువత ఎలాంటి నిరాశకు లోను కావొద్దనికోరారు. వచ్చే నాలుగైదు నెలల్లో ఉద్యోగ నియామకాలు చేపడతామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న ఖాళీలన్నింటినీ భర్తీ చేస్తామన్నారు. విద్యుత్ రంగంలో భారీగాఉద్యోగాలు వస్తాయన్నారు. ఉద్యోగులక్రమబద్ధీకరణ విషయంలో ప్రభుత్వానికి స్పష్టత ఉందన్నారు.
www.teacher4us.com
www.teacher4us.com
Comments
Post a Comment